ఆఫ్రికాను పోలియో రహిత ఖండంగా ప్రకటించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాయత్తమైంది. ఈ ఖండంలోని ఈశాన్య నైజీరియాలో చివరిసారి నాలుగేళ్ల క్రితం ఓ పోలియో కేసు నమోదైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారిక ప్రకటన చేయనున్నారు.
అలాగే పోలియో విషయంలో ప్రభుత్వం, ఆరోగ్య కార్యకర్తలు, కమ్యూనిటీలు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. కేవలం వారి కృషి వల్లే జీవితకాల పక్షవాతం నుంచి 1.8 మిలియన్ మంది చిన్నారులు బయటపడ్డారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అదేవిధంగా వీరి కృషి ఎందరికో స్పూర్తిదాయకమని అన్నారు.