కేవ‌లం రూ.7,499కే నోకియా సి3 స్మార్ట్ ఫోన్‌..!

-

హెచ్ఎండీ గ్లోబ‌ల్ కొత్త‌గా నోకియా సి3 స్మార్ట్ ఫోన్ ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఇందులో 5.99 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను అందిస్తున్నారు. ప‌క్క భాగంలో గూగుల్ అసిస్టెంట్ కోసం ఎక్స్ ప్రెస్ బ‌ట‌న్‌ను ఏర్పాటు చేశారు.

నోకియా సి3 స్పెసిఫికేష‌న్లు…

* 5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్
* 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్
* 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3040 ఎంఏహెచ్ బ్యాట‌రీ

నోకియా సి3 స్మార్ట్ ఫోన్ నోర్డిక్ బ్లూ, శాండ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.7499 ఉండ‌గా, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.8,999గా ఉంది. సెప్టెంబ‌ర్ 17 నుంచి ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version