టిక్ టాక్ కు అమెరికా షాక్…!

-

వీడియో షేరింగ్ యాప్ టిక్‌ టాక్‌ పై అమెరికా అధికారులు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించిన గడువుకు ముందు… అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒక చైనా కంపెనీకి భాగస్వామిగా మారడాన్ని జాతీయ భద్రతా ప్రమాదం అని అమెరికా అధికారులు పేర్కొన్నారు. వీడియో షేరింగ్ యాప్ యాజమాన్య సంస్థ బైట్‌డాన్స్… మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ప్రతిపాదనను తిరస్కరించింది.

టిక్‌ టాక్ యొక్క అమెరికన్ కార్యకలాపాలకు సంబంధించి ఒరాకిల్ నుండి బిడ్ అందుకున్నట్లు ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్ సోమవారం ధృవీకరించారు. అయితే ఒప్పందం గురించి కొన్ని వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ వెంచర్ వాషింగ్టన్ రెగ్యులేటర్లతో కలుస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. అమెరికన్ల డేటా సురక్షితం, ఫోన్లు సురక్షితం అని మేము నిర్ధారించుకోవాలని అప్పుడే అనుమతి ఇస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news