డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడెరిక్సన్‌పై దాడి

-

డెన్మార్క్‌ ప్రధానమంత్రి మెటె ప్రెడెరిక్సన్‌పై దాడి జరిగింది. రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌లో ఓ దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఏకంగా ప్రధానిపైనే దాడి జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పీఎంకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితేంటని వాపోతున్నారు.

‘కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్‌వెట్‌ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడని ప్రెడెరిక్సన్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.  భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. ఈ ఘటనతో ప్రధాని దిగ్భ్రాంతి చెందారని పేర్కొంది. దాడిలో ప్రధాని గాయపడ్డారా? లేదా? అన్న విషయంపైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్‌కు ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశణవుతోంది. ప్రెడెరిక్సన్‌పై దాడిని ఎన్డీయే నేత మోదీ ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news