రష్యాలోనే ప్రిగోజిన్​.. ‘వాగ్నర్‌’ గ్రూప్‌ చీఫ్‌ ఇంటిపై దాడులు

-

రష్యాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోనే ఉన్నట్లు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తెలిపారు. ప్రిగోజిన్‌ బెలారస్‌కు వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.. కానీ ఈ వ్యవహరానికి సంబంధించిన ఈ కీలక విషయం తాజాగా బయటపడింది.  కానీ, వాగ్నర్‌ క్యాంపులు మాత్రం ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని లుకషెంకో చెప్పలేదు. సంధిలో చేసుకున్న పలు హామీలను ఖరారు చేసుకోవడానికే ప్రిగోజిన్‌ రష్యాకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్‌ కార్యాలయం, ఇంటిపై బుధవారం దాడులు జరిగాయి. దాడులు నిర్వహించిన వివిధ ప్రాంగణాల నుంచి భారీగా బంగారం, నగదు, విగ్గులు, ఆయుధాలు, పాస్‌పోర్టులు, ఓ స్లెడ్జి హ్యామర్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు క్రెమ్లిన్‌ అనుకూల మీడియా సంస్థ ఇజ్వెస్టియా పేర్కొంది. ఈ మేరకు ఓ భవనంలోని ఫొటోలు, వీడియోలను బయటకు విడుదల చేసింది. ప్రిగోజిన్‌ బెలారస్‌లో లేడని వెల్లడించిన సమయంలో ఈ కథనాలు వెలువడటం గమనార్హం. అతడు సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ లేదా మాస్కోలో ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version