గాజా శరణార్థి శిబిరాలపై దాడులు యుద్ధ నేరాలతో సమానం : యూఎన్

-

హమాస్ ను సమూలంగా నాశనం చేయాలనే లక్ష్యంతో గాడాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఓవైపు హమాస్ ఇజ్రాయెల్ పై ఇంకా దాడులు కొనసాగిస్తుంటే.. మరోవైపు గాజాపై వైమానిక, భూతల దాడులతో ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది. అయితే హమాస్ మిలిటెంట్లను హతం చేసే క్రమంలో సామాన్య పౌరులపైనా దాడులకు తెగబడుతోంది ఇజ్రాయెల్. ఇప్పటికే ఆస్పత్రిలో బాంబుల వర్షం కురిపించి చిన్నారులు సహా వేల మంది ప్రాణాలు బలితీసుకుంది. ఇక ఇప్పుడేమో.. గాజా శరణార్థి స్థావరాలపై దాడి చేస్తూ ప్రాణాల కోసం తలదాచుకున్న వారి ప్రాణాలు తీస్తోంది. ఈ వ్యవహారంపై ఐక్య రాజ్య సిమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఐరాస ఖండించింది. ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా పరిగణించిన ఐరా.. ఆ దేశం చేస్తోంది అసమాన దాడులు అని.. శరణార్థి స్థావరాలపై దాడులు యుద్ధ నేరాలతో సమానమని హెచ్చరించింది. ఈ తప్పిదం యావత్ ప్రపంచం సహించదని ఐరాస మానవ హక్కుల కార్యాలయం మండిపడింది. ఇక  జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ రెండ్రోజుల వ్యవధిలో పలుమార్లు వైమానిక దాడులు చేసిందని.. ఈ ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, భారీ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని హమాస్‌ ఆధీనంలోని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news