బ్రిటన్‌లో ఆశ్రయం కోరిన షేక్ హసీనా.. ఇంకా నిర్ణయం తీసుకోని యూకే సర్కార్

-

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రస్తుతం భారత్లో తల దాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఇక్కడి నుంచి లండన్ వెళ్లాలనుకున్నారు. సోమవారం రోజున వెళ్లడం వీలు కాకపోవడంతో భారత్కు వచ్చారు. అయితే ఆమె రాజకీయ శరణార్థిగా బ్రిటన్‌ ఆశ్రయం కోరగా.. ఇంకా యూకే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఆమె కుమార్తె తులిప్‌ సిద్దిఖీ ప్రస్తుతం బ్రిటన్లో అధికారంలో ఉన్న లేబర్‌ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్‌ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు సమాచారం.

అక్కడి సర్కార్ నుంచి అనుమతులు వచ్చే వరకు హసీనా భారత్‌లోనే ఉండనున్నారట. ఇందుకోసం కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. హసీనా సోదరి రెహానా బ్రిటన్‌ పౌరురాలు. మరోవైపు బంగ్లాదేశ్‌ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్‌ ప్రభుత్వం స్పందించింది. గత రెండువారాలుగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణనష్టంపై ఐరాస నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడుతూ యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు.  ఇందులో షేక్‌ హసీనాకు ఆశ్రయమిచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news