దేశం విడిచి వెళ్లిపోయిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా..!

-

బంగ్లాదేశ్ లో గత కొద్ది రోజుల నుంచి అల్లర్లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే దాదాపు 300 మంది ప్రాణాలను కోల్పోయారు. ముఖ్యంగా రిజర్వేషన్ల కోసం అల్లర్లు జరుగుతున్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉంది కర్ప్యూ. సైనిక హెచ్చరికలతో హసీనా సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ బంగ్లాదేశ్ కి సంబంధించిన పౌరులు చేస్తున్న నిరసన హింసాత్మకంగా మారింది. దీని ఫలితంగా హింసాత్మక ఘర్షణలలో దాదాపు 300 మందికి ప్రాణాలను కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. నిరసన కారులు రోడ్ల పైకి వచ్చారు. నిరసన కారులకు అధికార పార్టీ అవామీ లీగ్ మద్దతు దారుల మధ్య జరిగిన ఘర్షణలో అధిక మంది మృత్యువాత పడినట్టు సమాచారం. ఢాకాలోని ప్రధాని ఇల్లు, ఆఫీస్ ను ముట్టడించారు ఆందోళన కారులు. 

Read more RELATED
Recommended to you

Latest news