ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో మట్టిమిద్దే కూలి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజా ఆ కుటుంబాన్ని పరామర్శించింది ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మట్టి మిద్దె కూలి నలుగురు కుటుంబ సభ్యులు మరణించడంతో అనాధగా మిగిలిన రెండవ కుమార్తె ప్రసన్నను అక్కున చేర్చుకొని నేనున్నానంటూ భరోసా ఇచ్చింది ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రసన్నకు రూ.10 లక్షలు చెక్కు, నాయనమ్మకు రెండు లక్షల రూపాయలు చెక్కు అందజేసింది ఎమ్మెల్యే అఖిల ప్రియ. అలాగే ప్రసన్న ఎంత వరకు చదివితే అంతవరకు ఎన్టీఆర్ స్కూల్లోనే చదివిస్తామని హామీ ఇచ్చింది ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ప్రసన్న చదువు బాధ్యతనే కాకుండా, ఆ చిన్నారి పెళ్లి వరకు తాను తోడుగా ఉంటానని తెలిపింది. మట్టిమిద్దే ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కొత్త బిల్డింగ్ లకు అప్లై చేసుకోవాలని పేర్కొంది ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.