ఒబామా సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం

-

ఉక్రెయిన్​పై భీకర యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షల చట్రం బిగిచాలని నిర్ణయించారు. అయితే వాటికి షాక్ ఇస్తూ రష్యా ప్రతి చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా 500 మంది అమెరికన్లు తమ దేశంలోకి అడుగుపెట్టకుండా రష్యా నిషేధం విధించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ జాబితా విడుదల చేసింది.

ఈ జాబితాలో 45 మంది యూఎస్‌ చట్టసభ సభ్యులు, మాజీ రాయబారులు ఉన్నారు. వ్యక్తుల పరంగా ఏయే కారణాలతో వీరిపై నిషేధం విధించారన్న విషయాన్ని మాస్కో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. అయితే, రష్యాపై వ్యతిరేకతను వ్యాప్తి చేయడం, ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం వంటి కారణాలతో ఈ నిషేధం అమలు చేసినట్లు పేర్కొంది.

ఈ ఆంక్షలతో పాటు.. రష్యా చెరలో ఉన్న వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇవాన్‌ గెర్‌ష్కోవిచ్‌కు కాన్సులర్‌ యాక్సెస్‌ ఇవ్వాలని అమెరికా చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించినట్లు మాస్కో విదేశాంగ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version