దేశాన్ని ఆర్ధికంగా దెబ్బ తీసే కుట్ర – 2 వేల నోట్ల రద్దుపై జగదీష్ రెడ్డి సంచలనం

-

2 వేల నోట్ల రద్దు పై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. 2 వేల నోట్ల రద్దు చర్య మోడీ ప్రభుత్వ తిరోగమన చర్య అని.. దేశాన్ని ఆర్ధికంగా దెబ్బ తీసే కుట్ర అని ఆగ్రహించారు. రద్దుతో దేశంలో పేదరికం ప్రబలే అవకాశం అని.. నోట్ల రద్దు ఎందుకు చేశాడో తెలీదు , ఎంత నల్ల ధనం వెలికితీశారో తెలీదని పేర్కొన్నారు. దేశ పరిపాలన ప్రజల కోసం కాకుండా కొంత మంది వ్యక్తుల కోసమేనని.. ప్రజలకు కాకుండా అజ్ఞాతంగా కొందరికి లబ్ది కోసమేనని చెప్పారు.

దేశ అభివృద్ధి కి దోహదపడే చర్య కాదు.. ఉపసంహరణతో లాభం ఉంటే ఎందుకు ప్రచారం చేయడంలేదని ఆగ్రహించారు. రేషన్ దుకాణంలో ఫోటో లేకుంటే గగొలు పెట్టిన ఆర్ధిక మంత్రి ఎందుకు రద్దు పై ప్రచారం చేయడంలేదు.. బీజేపీ పతనానికి రద్దు, అంతర్గతంగా దాగి ఉన్న రహస్య ఏజండా ఏంటో చెప్పాలని నిప్పులు చెరిగారు మంత్రి జగదీష్ రెడ్డి. ఉపయోగంలేని 2 వేల నోట్ ఎందుకు తెచ్చారు ఎందుకు రద్దు చేస్తున్నారు.. ఏం ఆశించి చేస్తున్నాడో మోడీ దేశ ప్రజలకు తెలపాలని డిమాండ్‌ చేశారు. మొత్తంగా 2 వేల నోట్ల రద్దు దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే.. పెట్టుబడిదారుల రహస్య అజెండాలో భాగమే రద్దు అని నిప్పులు చెరిగారు మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version