అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి నిక్కీ హేలీ ఔట్.. బరిలో మళ్లీ ఆ ఇద్దరే!

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు నిక్కీ హేలీ అధికారికంగా ప్రకటించారు. బుధవారం రోజున దేశవ్యాప్తంగా జరిగిన అభ్యర్థిత్వ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ట్రంప్‌నకు అభినందనలు తెలిపిన హేలీ, అందరి ఓట్లు సంపాదించేలా చూసుకోవాలని ఆయనకు సలహా ఇచ్చారు. నిక్కీ హేలీ రేసు నుంచి తొలగిపోవడంతో రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే మిగిలారు.

మరోవైపు సూపర్‌ట్యూస్‌డే పేరిట మంగళవారం అమెరికాలోని 15 రాష్ట్రాల్లో, ఒక టెరిటరీలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఘన విజయం సాధించారు. ఎక్కువ స్థానాల్లో గెలుపొందిన ట్రంప్‌, నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్‌ జో బైడెన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు..

మరోవైపు డెమోక్రాటిక్‌ పార్టీలో జో బైడెన్ మంగళవారం జరిగిన దాదాపు అన్ని ప్రైమరీల్లో గెలుపొందినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. లాంఛనంగా పార్టీ తరఫున నామినేషన్‌ పొందడానికి ట్రంప్‌ ఈ నెల 12 వరకు, బైడెన్‌ 19 వరకు నిరీక్షించాల్సి ఉంది. అయితే ఆఖరికి మరోసారి ఈ ఇద్దరే అధ్యక్ష బరిలో నిలిచే ఛాన్స్ ఉందని అమెరికన్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version