డ్రామాలు ఆపండి.. నేనే ప్రెసిడెంట్ అభ్యర్థిని : బైడెన్

-

డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిని తానేనని జో బైడెన్‌ పునరుద్ఘాటించారు. తన అభ్యర్థిత్వంపై పార్టీలో అంతర్గతంగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా డెమోక్రాట్ సభ్యులకు రెండు పేజీల లేఖ రాశారు. తన అభ్యర్థిత్వంపై కొందరు చేస్తున్న డ్రామాలను ఇక ఆపాలని పేర్కొన్నారు. తన విషయంలో వారు వ్యక్తపరుస్తున్న ఆందోళనలను తాను పరిగణనలోకి తీసుకున్నానని, కానీ ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించేందుకు తానే ఉత్తమం అనే గట్టి నమ్మకంతో ఉన్నానని స్పష్టం చేశారు. అలాంటి విశ్వాసం లేకపోతే ఎన్నికల బరిలో నిలిచేవాడినే కాదని తేల్చి చెప్పారు.

మూడున్నరేళ్లుగా తాను కనపరిచిన పనితీరును 90 నిమిషాల చర్చా కార్యక్రమంతో తీసిపారేయలేరు. నేను వైదొలగాలని అంటున్నవారు కొద్దిమంది మాత్రమే. ఆర్థిక రంగాన్ని గాడిలోపెట్టి, నిరుద్యోగాన్ని తగ్గించి, ప్రపంచంలో అమెరికా స్థానాన్ని పునరుద్ధరించగలిగాను. ప్రైమరీల ఎన్నికల్లో నాకు అనుకూలంగా ఇంతవరకు లక్షలమంది ఓట్లు వేశారు. మరి వైదొలగాలని కొంతమంది శాసనకర్తలు నన్ను ఎలా డిమాండ్‌ చేస్తున్నారు? నేను తప్పుకోను. ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నా ధర్మం. సొంతపార్టీలో ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా దేశంలో ప్రజాస్వామ్యానికి అండగా మనం ఎలా నిలబడగలం? అని బైడెన్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news