రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యాకు వెళ్లారు. మాస్కోలో దిగిన నరేంద్ర మోదీకి రష్యా నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఆ దేశ ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ మోదీకి స్వాగతం పలికారు. గార్డ్ఆఫ్ ఆనర్తో మోదీకి రష్యన్ సైన్యం వెల్కమ్ చెప్పింది. ఈ సందర్భంగా రష్యన్ కళాకారులు దాండియా, గర్భా నృత్యంతో భారత ప్రధానికి ఘన స్వాగతం పలికారు.
మోదీ బస చేస్తున్న హోటల్ వెలుపల రష్యన్ భక్తులు భజనలు పాడి నృత్యాలు చేశారు. మోదీ, పుతిన్ కరచాలనం చేసుకుంటున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మాస్కో వెళ్లిన మోదీ 2 రోజుల పాటు అక్కడ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొని రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రష్యా పర్యటనను తర్వా మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు.