బోయింగ్ విమానాల్లో ఇటీవల తరచూ సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విమానంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లోకి ఎగరగానే దాని ఇంజిన్ కవర్ ఊడిపోయి ఫ్లాప్స్‌పై చిక్కుకొంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకొంది. ఈ సారి కూడా బోయింగ్ విమానానికే సమస్య ఎదురైంది.
ది సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం డెనివర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి హ్యూస్టన్‌కు బయల్దేరి 10,300 అడుగుల ఎత్తుకు చేరిన సమయంలో ఒక్కసారిగా దీని ఇంజిన్ కవర్ ఊడిపోయింది. అది కాస్త రెక్కలకు ఉన్న ఫ్లాప్స్‌కు చిక్కుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. తక్షణమే గుర్తించిన పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రయాణికులను దింపేసి మరో విమానంలో హ్యూస్టన్‌కు పంపించారు. విమానం కవర్ ఊడి గాల్లో కొట్టుకొంటున్న వీడియోను ప్యాసింజర్లు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ఇంజిన్ కౌలింగ్ (ఇంజిన్ కవర్) వేలాడుతున్నట్లు ఉంది’ అని ఒకరు చెబుతున్నారు.
Lost some more pieces on rollout pic.twitter.com/rnJ4TiEj38
— Thenewarea51 (@thenewarea51) April 7, 2024