బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. పురాణగాధలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకుంటారు. కానీ కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈసారి బోనాల వేడుకను ఇంటికే పరిమితం చేశారు.
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ ఆరుకేసరి శివం ఆలయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అయితే తెలంగాణ బోనాల పండుగను సింగపూర్ కు నాలుగేళ్ళ క్రితం పరిచయం చేయడంతో టీసీఎస్ఎస్ పేరు చరిత్రలో నిలిచిపోవడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని సభ్యులు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో టీసీఎస్ఎస్ ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, గొనె రజిత నరేందర్ రెడ్డి, గడప స్వాతి రమేశ్ బండ శ్రీదేవి మాధవ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
అయితే ఈ వేడుకల్లో సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు, గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్. ఎమ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.