నా భార్య నుంచి భరణం ఇప్పించండి.. విడాకుల పిటిషన్​లో బ్రిట్నీ స్పియర్స్‌ భర్త

-

ప్రముఖ పాప్‌ సింగర్ బ్రిట్నీ స్పియర్స్  తన భర్త సామ్‌ అస్ఘరీ నుంచి విడిపోయారు. ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే.. అస్ఘరీ తన భార్య నుంచి భరణం కోరడం ఇప్పుడు చర్చనీయాంశవుతోంది. విడాకుల కోసం వేసిన పిటిషన్‌లో ఈ అభ్యర్థన చేశారు.

41 ఏళ్ల బ్రిట్నీ స్పియర్స్‌, 29 ఏళ్ల అస్ఘరీ గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇది మూడో పెళ్లి. 14 నెలల వ్యవధిలో వారి పెళ్లి బంధం ముక్కలైంది. జులై 28నే తాము విడిపోయినట్లు కోర్టులో వేసిన విడాకుల పిటిషన్‌లో అస్ఘరీ వెల్లడించారు.  తనకు బ్రిట్నీ నుంచి భరణం కావాలని అందులో కోరారు. అలాగే ఆమె భరణం కోరకుండా చూడాలన్నారు. తన న్యాయపరమైన ఖర్చులకు ఆమె చెల్లింపులు చేసేలా చూడాలని అభ్యర్థించారు.

మరోవైపు ఈ బంధం వీగిపోవడంపై బ్రిట్నీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వారు విడిపోయి మూడు వారాలు అయినప్పటికీ.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్ఘరీపై బ్రిట్నీ శారీరక హింసకు పాల్పడ్డారని, అలాగే ఆమెకు వివాహేతర సంబంధం ఉందని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news