చైనా కుప్పకూలిన విమానం… విమానంలో 133 మంది ప్రయాణికులు మృతి..?

-

చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 133 మందితో వెళ్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం కుప్పకూలింది. కున్ మింగ్ నుంచ గ్వాంగ్ జూ కు వెళ్తుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గువాంగ్ షీ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎతైన పర్వతాల్లో విమానం కూలిపోవడంతో సహాయకచర్యలకు ఇబ్బంది అవతుంది. ప్రమాదానికి గురైన వెంటనే విమానం కూలిపోయిన ప్రాంతం నుంచి పెద్దఎత్తున మంటలు, పొగ కనిపించాయి. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737 రకానికి చెందినది. 

అయితే ప్రస్తుతానికి మాత్రం విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అధికారులు యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎతైన కొండల్లో విమానం కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఎదురవుతోంది. 133 మంది ప్రయాణికుల్లో ఎంతమంది మరణించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version