స్కూల్ జిమ్​లో కూలిన​ పైకప్పు .. 9 మంది దుర్మరణం

-

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఉన్న ఓ పాఠశాల జిమ్​ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడికి చేరి రక్షణ చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు 160 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో జిమ్​లో 19 మంది ఉన్నారని స్థానిక మున్సిపల్ అధికారులు తెలిపారు. అందులో నలుగురు వ్యక్తులు తప్పించుకున్నారని. 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు, 13 మంది బయటకు తీశామని చెప్పారు. అందులో ముగ్గురిని స్వల్ప గాయాలతో బయటకు తీశామని.. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించినట్లు చెప్పారు.

పాఠశాల ప్రాంగణంలో మరో భవనం నిర్మిస్తుండగా.. జిప్​ పైకప్పుపై పెర్లైట్​ను ఉంచినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వర్షాలు కురుస్తుండటం వల్ల.. పెర్లైట్​ బరువు పెరిగడంతో పైకప్పు కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news