కరోనా వ్యాక్షిన్ కోసం భారీగా ఖర్చు చేస్తోన్న అమెరికా …!

-

ఎక్కడో చైనా దేశంలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీని కోసం అనేక దేశాల్లోని అనేక శాస్త్రవేత్తలు పగలు రేయి అనుకోకుండా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ని కనుగొనడంలో తలమునకలై ఉన్నారు. ఈ పరిశోధన కోసం అనేక దేశప్రభుత్వాలు, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆయా కంపెనీలకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. ఇదే నేపథ్యంలోనే ఆక్స్ఫర్డ్ కు ఇప్పటికే 1.2 బిలియన్ డాలర్లను అమెరికా దేశంతో పాటు మరో కంపెనీ భారీ ఆర్థిక సహాయాన్ని అందించింది.

carona
carona

ఇకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఆస్ట్రాజెనికా కంపెనీ అభివృద్ధి చేసిన వాక్సిన్ కోసం అమెరికా దేశం ఇప్పటికే భారీ మొత్తంలో సహాయం అందించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే అమెరికాకు 40 కోట్ల వ్యాక్సిన్లను అందించేందుకు ఆస్ట్రాజెనికా కంపెనీ అంగీకారం తెలిపింది. వీటితో పాటు కరోనా చికిత్స కోసం కృషి చేస్తున్న రెజెనెరాన్ ఫార్మా కు మరో 400 మిలియన్ డాలర్లు కూడా అమెరికా ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా పది కోట్ల వ్యాక్సిన్ డోసులు ను అందించేందుకు అమెరికా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news