క్రొయేషియా విదేశాంగ మంత్రి గోర్డాన్ గిలిక్ డార్మాన్ వివాదంలో ఇరుకున్నారు. బెర్లిన్‌లో జరిగిన ఈయూ విదేశాంగ మంత్రుల మీటింగ్‌లో ఆయన జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలీనా బేర్‌బాక్‌కు కిస్ ఇచ్చారు. ఈ ఘటన పట్ల స్థానిక యురోపియన్ మీడియా గగ్గోలు చేస్తోంది. మంత్రి అన్నలీనాతో క్రొయేషియా మంత్రి అనుచితంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.క్రొయేషియా విదేశాంగ మంత్రి గోర్డాన్ గిలిక్ డార్మాన్ వివాదంలో ఇరుకున్నారు. బెర్లిన్‌లో జరిగిన ఈయూ విదేశాంగ మంత్రుల మీటింగ్‌లో ఆయన జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలీనా బేర్‌బాక్‌కు కిస్ ఇచ్చారు. ఈ ఘటన పట్ల స్థానిక యురోపియన్ మీడియా గగ్గోలు చేస్తోంది. మంత్రి అన్నలీనాతో క్రొయేషియా మంత్రి అనుచితంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
విదేశాంగ మంత్రుల సమావేశానికి వచ్చిన వారికి వెల్కమ్ చెబుతున్న సమయంలో.. క్రొయేషియా మంత్రి అత్యుత్సాహంతో జర్మనీ మంత్రి చెంపపై కిస్ ఇచ్చారు. ఈ ఘటనపై దుమారం రేగడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. మంత్రుల్ని ఒకర్ని ఒకరు పలుకరించుకుంటారని, ఎవరైనా దీన్ని తప్పుగా భావిస్తే క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. ఈయూ విదేశాంగ మంత్రులు అందరూ గ్రూపు ఫోటో దిగుతున్న సమయంలో.. జర్మనీ మహిళా మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చిన క్రొయేషియా మంత్రి.. ఆ జోరులోనే ఆమె బుగ్గపై కిస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆ మహిళా మంత్రి తన ముఖాన్ని మంత్రి వైపు తిప్పింది. అయితే ఈ ఘటనపై కామెంట్ చేసేందుకు ఆ మహిళా మంత్రి నిరాకరించారు.