తుర్కియే పార్లమెంటులో తన్నుకున్న ఎంపీలు.. వీడియో వైరల్

-

తుర్కియే పార్లమెంటులో శుక్రవారం రోజున దాడి చోటుచేసుకుంది.  అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోల్లో రక్తం మరకలు కూడా కనిపించడంతో దాడులు తీవ్రంగానే జరిగినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అసలేం జరిగిందంటే..

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ నేత క్యాన్‌ అటలే పార్లమెంటు డిప్యూటీగా ఎన్నికయ్యారు. అయితే ఆయన 2013లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తుండటంతో పార్లమెంటుకు హాజరయ్యేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఈ అంశంపై శుక్రవారం రోజున తుర్కియే పార్లమెంటులో చర్చ జరుగుతుండగా.. అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. వర్కర్స్‌ పార్టీ సభ్యుడిని అధికార పార్టీ సభ్యుడు కొట్టినట్లు వీడియోలో కనిపించింది. చివరికి ఓ మహిళా సభ్యురాలిపైనా దాడి చేయడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news