రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ను అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లిక్ పార్టీ తరఫున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన లాంఛనంగా రిపబ్లికన్ పార్టీ నామినేషన్ను ఆమోదించారు. నిజమైన విశ్వాసం, బలం, ఆశలతో కూడిన సందేశంతో పార్టీ ప్రతినిధులు, ప్రజల ముందు నిలబడతానని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా అద్భుత విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

“నాపై హత్యాయత్నం జరిగిన తరువాత అమెరికా ప్రజలు చూపిన ప్రేమకు, మద్దతకు కృతజ్ఞతలు. నా సంకల్పం చాలా దృఢమైనది. అమెరికన్ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని అందించేదుకు నేను కట్టుబడి ఉన్నాను. నేను మీ మద్దతును, భాగస్వామ్యాన్ని, మీ ఓటును వినయంగా అడుగుతున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకోవడానికి కృషి చేస్తాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచను.” అని గురువారం మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో మూడోసారి అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నామినేషన్ను అధికారికంగా ఆమోదించిన తరువాత డొనాల్డ్ ట్రంప్ పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news