ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ తల్లి అరెస్టు

-

వివాదాల్లో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ తల్లి మనోరమ ఖేడ్కర్‌ను పుణె పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ముందు హాజరుపరిచగా.. ఆమెను మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓ భూవివాదంలో పూజ తల్లి మనోరమ కొందరిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

పుణెలోని ముల్షి తహసీల్‌ పరిధిలోని ధద్వాలి గ్రామంలో భూవివాదం విషయంలో ఆమె తన సెక్యూరిటీ గార్డులతో కలిసి తుపాకీతో బెదిరింపులకు దిగినట్లు ఆ వీడియోలో కనిపించింది. ఈ వ్యవహారంలో ఖేడ్కర్‌ దంపతులతో పాటు మరో ఐదుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్లు పుణె పోలీసులు తెలిపారు. విచారణకు పిలిచినా ఆ దంపతులు రాలేదని, మొబైల్‌ ఫోన్లు స్విచాఫ్‌ చేశారని ఈ క్రమంలోనే ఆమెను రాయ్‌గఢ్‌లోని ఓ లాడ్జి నుంచి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పూజ తండ్రి దిలీప్‌ ఖేడ్కర్‌పై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలో రెండుసార్లు ఆయన సస్సెన్షన్‌కు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news