నేను గెలిస్తే మీ తుపాకులు పదిలం.. ఎన్‌ఆర్‌ఏ సభ్యులకు ట్రంప్‌ హామీ

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశాధ్యక్షుడవ్వాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. వరుస ప్రసంగాలు ఇస్తూ అమెరికన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన అమెరికా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏ) సమావేశానికి హాజరయ్యారు.

donald-trump

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ నవంబరు నెలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే.. మీ తుపాకులపై ఎవరూ వేలు కూడా పెట్టలేరని ఎన్‌ఆర్‌ఏ సభ్యులకు డొనాల్డ్‌ ట్రంప్‌ హామీ ఇచ్చారు. రిపబ్లికన్‌ పార్టీ పార్టీలో ఎన్‌ఆర్‌ఏ సభ్యులు ఎక్కువమందే ఉండటంతో ట్రంప్ వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే ఎన్‌ఆర్‌ఏ దీర్ఘకాల సీఈవో వేన్‌ లా పియెర్‌ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో గత నెలలో రాజీనామా చేశారు. ప్రైవేటు విమానాలు, విలాసవంతమైన బోట్లలో తిరగడానికి, ఆఫ్రికాలో జంతువుల వేటకూ, ఇతరత్రా జల్సాలకు వేన్‌ ఎన్‌ఆర్‌ఏ నిధులను దుబారా చేశారు.

దీంతో ఎన్‌ఆర్‌ఏ దివాలా పిటిషను వేసి,  కార్యాలయాన్ని న్యూయార్క్‌ నుంచి టెక్సాస్‌కు మార్చడానికి అనుమతించాలని కోరినా కోర్టు నిరాకరించింది. ఆయుధాలు కలిగి ఉండటం రాజ్యాంగపరమైన హక్కంటూ దీన్ని వదులుకోడానికి ఎన్‌ఆర్‌ఏ సభ్యులు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌..” నేను గెలిస్తే మీ తుపాకులు పదిలం.. నాదీ పూచీ” అంటూ వారికి వత్తాసు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news