ట్రంప్, మస్క్ కలిసి స్టెప్పేస్తే ఇలా ఉంటది.. వీడియో వైరల్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ దేశంలో ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఓవైపు హోరాహోరీగా ప్రచారం చేస్తూ.. మరోవైపు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇంకోవైపు ఇరు వైపుల మద్దతుదారులు సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేస్తున్నారు.

ఇక ఇటీవలే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రముఖ బిలియనీర్‌, ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ చర్చా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అయితే తాజాగా మస్క్ ట్రంప్‌ కు సంబంధించిన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. ట్రంప్, మస్క్ కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియోను మస్క్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గిట్టనివాళ్లు ఇది ఏఐ మాయ అని అంటారు అని మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాకపోతే ఇది నిజంగా ఏఐ మాయే. ఏఐతో ఈ ఇద్దరు స్టెప్పులేసినట్లు వీడియో రూపొందించారు. ప్రస్తుతం ఇది నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version