తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీ విజయం

-

డ్రాగన్ దేశం చైనాకు గట్టి షాక్ తగిలింది. తమ భూభాగంలో ఎలాగైనా కలిపేసుకోవాలనుకుంటున్న తైవాన్ దేశ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమొక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ) మూడోసారి విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తైవాన్‌ ఉపాధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తె ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆయనతో తలపడిన ప్రతిపక్ష పార్టీల నేతలు కువోమింగ్‌ తాంగ్‌ పార్టీకి చెందిన హు యు ఇయ్‌, తైవాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన కోవెన్‌ జి ఓటమి పాలయ్యారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అనంతరం ఓట్ల లెక్కింపు జరగ్గా రాత్రి వరకు ఫలితాలు వెల్లడయ్యాయి.

రాబోయే నాలుగేళ్లలో చైనాతో సంబంధాలను నిర్దేశించే ఎన్నికలు కావటంతో తైవాన్‌ ప్రజలు అధికార డీపీపీ వైపు మళ్లీ మొగ్గు చూపినట్లు సమాచారం. అధికార పక్షం-డీపీపీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన లాయ్‌ చింగ్‌ తెను చైనా వ్యతిరేకించింది. అంతే కాకుండాయుద్ధం కావాలా లేక శాంతి కావాలా తేల్చుకోవాలంటూ హెచ్చరించింది. అయితే తైవాన్ ప్రజలు చైనా హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోలేదు. డ్రాగన్ వార్నింగ్ను నిర్ధ్వందంగా తోసిపుచ్చిన తైవాన్‌ ప్రజలు అధికార పార్టీకే పగ్గాలు కట్టాలని నిర్ణయించినట్లు ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమన్న చైనా వాదనను ప్రస్తుత అధ్యక్షురాలుత్సాయ్‌ యింగ్‌ వెన్‌ తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news