ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తరచూ వార్తల్లో నిలుస్తారనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలు తెగ చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవలే ఎక్స్(ట్విటర్లో) బ్లాక్ ఫీచర్‌ను తొలగిస్తామని మస్క్ ప్రకటించారు. ఇక ఇప్పుడు తాజాగా మరో ఆఫర్‌తో ముందుకు వచ్చారు.
ఎలాన్ మస్క్.. జర్నలిస్టులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జర్నలిస్టులు నేరుగా ఎక్స్‌లో తమ కథనాలను ప్రచురించుకునేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా ఎక్కువగా డబ్బు సంపాదించాలనుకునేవారు.. తమ రచనలో మరింత స్వేచ్ఛ తీసుకుని తమ కథనాలను రాసుకోవచ్చని చెప్పారు.
‘పాత్రికేయులు ప్రచురించిన తమ కథనాలను చదవడానికి వినియోగదారుల నుంచి (యూజర్ల) డబ్బులు తీసుకోనే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వినియోగదారులు చదివే ప్రతి ఆర్టికల్ ఆధారంగా (కథనం) ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెలవారీ సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలి. సబ్‌స్క్రిప్షన్ చేయకపోతే మరింత చెల్లించవలసి ఉంటుంది’ అని మస్క్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.