సీనియర్‌ సిటిజన్స్‌కు ఎల్‌ఐసీలో సరల్‌ పెన్షన్ పాలసీ బెస్ట్‌.. నెలకు రూ. 12వేలకు పైగా పెన్షన్‌

-

పన్నుల నుంచి మినహాయింపు కోసం చాలా మంది ఉద్యోగులు ఏదో ఒక ఎల్‌ఐసీ పాలసీలో జాయిన్‌ అవుతారు. మీరు కూడా ఈ సంవత్సరం పాలసీ తీయాలి అనుకుంటున్నారా..? అయితే ఎల్‌ఐసీలో చాలా స్కీమ్స్‌ ఉన్నాయి. వాటి గురించి బాగా తెలుసుకుని మీకు ఏది సెట్‌ అవుతుందో అందులో జాయిన్‌ అవ్వొచ్చు. ఎల్‌ఐసీలో పెన్షన్ స్కీమ్స్ కూడా ఒక భాగమనే చెప్పుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్స్ తీసుకోవడం వల్ల ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. పదవీ విరమణ చేసిన వారికి, సీనియర్ సిటిజన్స్‌కు ఈ ఎల్ఐసీ (LIC) పాలసీలు అనువుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎల్ఐసీ అందించే ప్లాన్స్‌లో సరల్ పెన్షన్ పాలసీ (Policy) కూడా ఉంది. ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల అదిరే బెనిఫిట్ పొందొచ్చు. ఎలాంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయంటే.. తెలుసుకుందాం.

ఎల్ఐసీ అందించే సరల్ పెన్షన్ ప్లాన్‌లో ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారకి 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. మీరు పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన పొందే వెసులుబాటు ఉంది. ఇమ్మీడియట్ యాన్యుటీ ఆప్షన్ కింద మీరు ఈ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే వన్‌ టైమ్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు కొంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి. నామినీ కూడా నమోదు చేసుకోవచ్చు.

పాలసీలో సింగిల్ లైఫ్ లేదా జాయింట్ లైఫ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. సింగిల్ లైఫ్ ప్లాన్ అయితే పాలసీదారుడు మరణించిన తర్వాత పాలసీ డబ్బులను వెనక్కి చెల్లిస్తారు. అదే జాయింట్ లైఫ్ ఆప్షన్ అయితే భార్యాభర్తలు ఇద్దరూ మరణించిన తర్వాత పాలసీ డబ్బులను నామినీకి అందిస్తారు. పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం వారికి పెన్షన్ వస్తుంది. మరణిస్తే అప్పుడు భాగస్వామికి పెన్షన్ చెల్లిస్తారు. భాగస్వామి కూడా మరణిస్తే అప్పుడు నామినీకి పాలసీ డబ్బులు ఇస్తారు.

ఎల్ఐసీ అందించే ఈ ప్లాన్ కింద రూ. 1000 నుంచి పెన్షన్ పొందొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏంలేదు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పెన్షన్ పొందొచ్చు.

ఉదాహరణకు 42 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ. 30 లక్షలు పెట్టి ప్లాన్ కొంటే నెలకు దాదాపు రూ. 12,400 వరకు పెన్షన్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా మీరు చెల్లించే సింగిల్ ప్రీమియం ఆధారంగా మీకు వచ్చే పెన్షన్ కూడా మారుతుంది. అందుకే ఎక్కువ డబ్బులు కట్టి ప్లాన్ తీసుకుంటే అప్పుడు ప్రతి నెలా అధిక పెన్షన్ పొందొచ్చు. చివరిలో మీ డబ్బులు మీ భాగస్వామి లేదా నామినీకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version