ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఘర్షణ.. రాకెట్లు పంపాల్సింది అక్కడికంటూ మస్క్ పోస్టు

-

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ ఓ పోస్టు చేశారు.  ‘‘మనమంతా రాకెట్లను పరస్పరం ప్రయోగించుకోవడం మాని.. అంతరిక్షంలోకి పంపించాలి’’ అంటూ శాంతియుత పరిస్థితులకు పిలుపునిచ్చారు. ఓ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తున్న ఫొటోను దీనికి జత చేశారు.

ఇవాళ తెల్లవారుజామున ఇరాన్‌లోని అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో అధికారులు వెంటనే గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసి గగనతలంలో కన్పించిన అనుమానాస్పద వస్తువులను కూల్చి వేసిందని ఇరాన్ అధికారులు తెలిపారు. ఆ పేలుడు శబ్దాలు దానివేనని ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ప్రస్తుతానికి పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు సమాచారం.  అయితే ఈ దాడులు ఇజ్రాయెల్ చేసి ఉండొచ్చని అమెరికా అంటుండగా దీనిపై మాట్లాడటానికి ఇజ్రాయెల్ నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news