US Elections 2024 : కమలాహారిస్‌పై డీప్‌ఫేక్‌ వీడియో

-

అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ఎన్నికైన ఉపాధ్యక్షురాలు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు దీటుగా పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రచారాన్ని హోరెత్తిస్తూ తమ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంటున్న వేళ డీప్ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది. కమలా హారిస్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోను టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చర్య నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మస్క్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ఇలాంటి వీడియోలు చట్టవిరుద్ధమని కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ హెచ్చరించారు. అధ్యక్షుడు జో బైడెన్‌ను వృద్ధుడని కమల వ్యాఖ్యానించినట్టుగా ఆ వీడియోలో వక్రీకరించినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news