అమెరికా టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ మధ్య కేజ్ ఫైట్ పక్కాగా జరిగేలాగే కనిపిస్తోంది. మస్క్ ఆదివారం చేసిన ఓ ట్వీట్‌తో నెటిజన్లు ఈ నిర్ధారణకు వచ్చారు. తమ మధ్య జరిగే పోరు ‘ఎక్స్ (ట్విటర్)’లో ప్రత్యక్ష ప్రసారమవుతుందని మస్క్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు జుకర్‌బర్గ్ రియాక్ట్ అయ్యారు. మస్క్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. లైవ్ స్ట్రీమింగ్‌కు ఇంతకంటే మంచి వేదిక లేదా? అంటూ ఎద్దేవా చేశారు.
‘‘జుకర్, మస్క్ మధ్య జరిగే పోరు ఎక్స్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. దాని ద్వారా వచ్చిన నిధులు స్వచ్ఛంద సంస్థలకు వెళ్తాయి’’ అని మస్క్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై జుకర్‌బర్గ్ తాను కొత్తగా ప్రారంభించిన ‘థ్రెడ్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఛారిటీ కోసం డబ్బును సేకరించేప్పుడు ఇంతకంటే విశ్వసనీయమైన వేదికను మనం ఉపయోగించలేమా?’’ అని కౌంటర్ ఇచ్చారు. జుకర్‌బర్గ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కేజ్ ఫైట్ కంటే ముందే వీరిద్దరి నుంచి పంచ్‌లు దూసుకొస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.