కూనవరం చేరుకున్న సీఎం జగన్.. వరద బాధితులకు పరామర్శ

-

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమ, మంగళ వారాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అల్లూరి సీతారామరాజు, మంగళవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం జగన్. ఈ మేరకు నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలానికి చేరుకున్నారు.

cm jagan aerial
cm jagan aerial

మరికాసేపట్లో విఆర్ పురం మండలంలోని వరద బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం 12:45 కు బయలుదేరి ఒంటి గంటకి కోతుల గుట్ట హెలిప్యాడ్ కి చేరుకుంటారు. అనంతరం 1:05 గంటలకు బయలుదేరి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం వెళతారు. అక్కడ వరద బాధిత కుటుంబాలతో మాట్లాడి నష్టం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news