Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది.టెస్లా షేర్ల విలువ క్షీణించడం ఎలాన్ మస్క్ ఆస్తిపై ప్రభావం చూపించింది. ఈ ఏడాది ఇప్పటికే ఆయన సంపదలో రూ. 3లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయిందని బ్లూమ్బిర్గ్ నివేదిక తెలిపింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు ఎలాన్ మస్క్.
ప్రస్తుతం తొలి ,రెండు స్థానాల్లో ఫ్రాన్స్ వ్యాపార వేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ (201 బిలియన్ డాలర్లు),అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (198 బిలియన్ డాలర్లు) ఉన్నారు. మస్క్ సంపద 189 బిలియన్ డాలర్లుగా ఉంది.ఎలన్ మస్క్ తర్వాత మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ 182 బిలియన్ డాలర్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు.