వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పిన ఫిన్​లాండ్ ప్రధాని

-

అతిచిన్న వయసులోనే దేశ అత్యున్నత పదవి చేపట్టి ఫిన్లాండ్‌లో డైనమిక్‌ ప్రధానిగా పేరు తెచ్చుకున్న సనా మారిన్‌ వ్యక్తిగతంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వైవాహిక బంధానికి ఆమె ముగింపు పలికారు. భర్త మార్కస్‌ రైకోనెన్‌ నుంచి ఆమె విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని సనా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు.

‘‘మేమిద్దం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. మేం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. కలిసి పెరిగాం. 19 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పటికీ మేం మంచి స్నేహితులమే. మా ప్రియమైన కుమార్తెకు తల్లిదండ్రులమే. ఒక కుటుంబంగా మా కుమార్తె కోసం సమయాన్ని వెచ్చిస్తాం’’ అని ప్రధాని సనా మారిన్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చారు.

వ్యాపారవేత్త, మాజీ ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌ అయిన మార్కస్‌ రైకోనెస్‌తో సనా మారిన్‌ కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. వీరి బంధానికి గుర్తుగా ఓ కుమార్తె జన్మించింది. సనా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత 2020లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే మూడేళ్లకే వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version