గూగుల్, మెటా ల‌కు ఫ్రాన్స్ షాక్.. భారీ జ‌రిమానా

-

ప్ర‌పంచంలో టెక్నాల‌జి విష‌యంలో ముందు ఉన్న గూగుల్, మెటా ల‌కు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. యూజ‌ర్ల ప్రైవ‌సీ విష‌యంలో ఫ్రాన్స్ ప్ర‌భుత్వం భారీ జ‌రిమానా విధించింది. ఫ్రాన్స్ డేటా ప్రైవ‌సీ వాచ్ డాగ్ సీఎన్ ఐఎల్ భారీ జ‌రిమానా విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇంట‌ర్నెట్ బ్రౌజింగ్ చేసే స‌మ‌యంలో ఆన్ లైన్ ట్రాక‌ర్స్ కుకీస్ కు యూజ‌ర్లు నో చెప్ప‌డానికి వీలు లేకుండా గూగుల్ క‌ఠినత‌రం చేసింద‌ని ఫ్రాన్స్ డేటా ప్రైవ‌సీ వాచ్ డాగ్ సీఎన్ఐఎల్ ఆరోపించింది. దీనికి గాను గూగుల్ కు 150 మిలియ‌న్ యూరోల‌ను జ‌రిమానా విధించింది.

అంటే ఇండియా క‌రెన్సీలో దాదాపు రూ. 1,265 కోట్లు జ‌రిమానా విధించింది. అలాగే ఇదే కార‌ణంతో మెటాలో భాగం అయిన ఫేస్‌బుక్ కు కూడా భారీ జ‌రిమానా విధించింది. ఫేస్ బుక్ కు 60 మిలియ‌న్ల యూరోలు అంటే దాదాపు రూ. 505 కోట్లు జ‌రిమానా విధించింది. అలాగే వీటిని స‌రి చేసుకోవాల‌ని గూగుల్, మెటా ల‌ను ఆదేశించింది. తాము చెప్పిన మార్పులు చేయ‌కుంటే రోజుకు ల‌క్ష యూరోలు అంటే రూ. 85 కోట్లు జ‌రిమానా విధిస్తామ‌ని తెల్చిచెప్పింది. అయితే దీని పై గూగుల్ ప్ర‌తినిధి స్పందించారు. సీఎన్ఐఎల్ చెప్పిన మార్పుల‌ను చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news