యుద్ధం వేళ వెల్లివిరిసిన మానవత్వం.. గాజా నుంచి వచ్చే ‘వారికి’ ఈజిప్టులో ప్రవేశానికి అనుమతి

-

గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఓవైపు వైమానిక దాడులు.. మరోవైపు భూతల దాడులతో ఆ ప్రాంత పౌరులపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ దాడుల్లో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది క్షతగాత్రులయ్యారు. అయితే గాజాలో ఉన్న పౌరులకు ఈజిప్ట్ మానవతా సాయం చేయడానికి ముందుకు వచ్చింది. గాజా స్ట్రిప్‌లో విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నవారు, తీవ్రంగా గాయపడ్డవారు తమ దేశంలో ప్రవేశించేందుకు ఈజిప్టు అనుమతించింది. గాజా స్ట్రిప్‌ నుంచి ఈజిప్టునకు వెళ్లే కీలక రఫా క్రాసింగ్‌ ను వారి కోసం తెరిచింది. ఈజిప్టు, హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య అమెరికా మద్దతుతో ఖతార్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ బార్డర్ ను తెరిచినట్లు ఈజిప్టు తెలిపింది.

అయితే కేవలం విదేశీ పాస్‌పోర్టు ఉన్న వారే కాకుండా గాజాలో తీవ్రంగా గాయపడి చికిత్స కోసం ఎదురుచూస్తున్న వారిని కూడా తరలించేందుకు  ఇజ్రాయెల్‌తో పాటు ఈజిప్టు కూడా అంగీకరించింది. క్షతగాత్రులకు తమ దేశంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు ఒప్పుకుంది. ఈజిప్టు నుంచి గాజా లోపలికి అంబులెన్సులను పంపించి.. తీవ్రంగా గాయపడ్డవారిని తీసుకెళుతోంది. ఇప్పటి వరకు 88 మందిని అంబులెన్సులలో తీసుకెళ్లినట్లు ఈజిప్టు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం 500 మంది విదేశీ పాస్‌పోర్టుదారులను గాజా వీడి ఈజిప్టు వచ్చేందుకు అనుమతించారు.

Read more RELATED
Recommended to you

Latest news