అలాగైతే బందీలు ప్రాణాలతో ఉండరు.. ఇజ్రాయెల్‌కు హమాస్‌ వార్నింగ్​

-

హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం పాటించాలని అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి నెలకొన్న తరుణంలో ఈ దాడులను మరింత తీవ్రతరం చేసింది. గాజాలో ఓవైపు భూతల పోరాటం.. మరోవైపు వైమానిక దాడులతో మారణకాండ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​కు హమాస్ ఓ వార్నింగ్ పంపించింది. ఖైదీల విడుదల కోసం తాము చేసిన డిమాండ్లు నెరవేరకపోతే ఇజ్రాయెల్‌కు చెందిన బందీలు సజీవంగా గాజా నుంచి బయటపడలేరని హమాస్ బెదిరింపులు షూరు చేసింది. అయినా సరే ఈ హెచ్చరికలు పెడచెవిన పెట్టి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

గాజాలో హమాస్‌ చెరలో 137 మంది బందీలు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు 7 వేల మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్నారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రదాడి అనంతరం గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌.. హమాస్ మిలిటెంట్లు వెంటనే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు హమాస్ ముగింపు దగ్గర పడిందంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తాజాగా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news