అమెరికాలో భారత్ విద్యార్థులదే హవా..

-

అమెరికా చదవులపై దేశంలో ఆదరణ పెరుగుతుంది. 2019-20 విద్యా సంవత్సరంలో భారత్ కు చెందిన దాదాపు 2లక్షల మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యను చదివేందుకు అడ్మిషన్లు పొందారు. అండర్ గ్రాడ్యుయేషన్లో ప్రవేశాలు పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అన్నిదేశాల నుంచి 10.75 లక్షలకు పైగా విద్యార్థులు వెళ్లగా.. 18శాతం మంది భారత్ కు చెందిన వారు కావటం విశేషం.

america
america

అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఓపెన్‌ డోర్స్‌ నివేదికను విడుదల చేసింది. గత పదేళ్లలో భారత్‌ విద్యార్థుల సంఖ్య దాదాపు రెండింతలైందని ఆ నివేదికలో పేర్కొంది. భారత విద్యార్థుల సంఖ్య పెరగడంతో అమెరికా సలహాలు సూచనలు అందించేందుకు అమెరికా విద్య సలహా కేంద్రాలను యూస్ డిపార్డుమెంట్ ఆఫ్ స్టేట్ ఏర్పాటు చేసింది. దేశంలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబయిలో ఏర్పాటు చేశారు.

2019-20 విద్యా సంవత్సరంలో 10,75,496 మంది విదేశీ విద్యార్థులు అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన వారే అధికం. ఆ తర్వాత గణితం, కంప్యూటర్‌ సైన్సు చదివే వారు ఉన్నారు. మూడో స్థానంలో వాణిజ్యం, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదివేవారు ఉన్నారు. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్న వారిలో చైనా నుంచి 34.6 శాతం, భారత్‌ నుంచి 18 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంఖ్య గత ఏడాదితో పోల్చితే 2019-20లో మన దేశ విద్యార్థుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2018-19లో అంతర్జాతీయ విద్యార్థుల్లో 18.4శాతంతో 2,02,014 మంది ఉండగా.. ఈసారి ఇది 18 శాతంతో 1,93,124కు తగ్గింది. చైనా నుంచి ప్రవేశాలు పొందిన వారి సంఖ్య మాత్రం 0.8కు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news