బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీకి సాహో దర్శకుడు?

ప్రభాస్ తో సాహో తెరకెక్కించిన సుజిత్ కి ఆ తర్వాత సినిమా అవకాశాలేమీ రాలేదు. మెగాస్టార్ తో లూసిఫర్ సినిమాని రూపొందించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. తాజా సమాచారం డైరెక్టర్ సుజిత్ కి బాలీవుడ్ లో ఆఫర్ వచ్చిందని వినిపిస్తుంది. తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్న బెల్లంకొండ సుజిత్ ని దర్శకుడిగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

సాహో చిత్రం దక్షిణాన ఆదరణ దక్కించుకోనప్పటికీ ఉత్తరాది వారిని బాగానే ఆకట్టుకుంది. దాంతో బాలీవుడ్ ప్రేక్షకులకి సుజిత్ మీద నమ్మకం ఉంది. అందువల్ల బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ మరికొద్ది రోజుల్లో వార్త బయటకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విధంగానైనా సుజిత్ కి అవకాశం వస్తుందేమో చూడాలి.