కార్చిచ్చును ఆర్పేందుకు వెళ్లి.. పరస్పరం ఢీకొన్న హెలికాఫ్టర్లు

-

అడవిలో కార్చిచ్చు రాజుకుంది. ఆ కార్చిచ్చును ఆర్పేందుకు వెళ్లిన రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం.

“కాలిఫోర్నియాలోని కాబాజోన్‌ ప్రాంతంలో ఆదివారం కార్చిచ్చు వ్యాపించింది. దాన్ని ఆర్పేందుకు కాలిఫోర్నియా అటవీ, అగ్నిమాపక సంరక్షణ విభాగం రెండు హెలికాఫ్టర్లను రంగంలోకి దింపింది. మంటలను అదుపు చేసే క్రమంలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ పొగ వల్ల అక్కడ ఏం కనిపించకుండా పోయింది. దీంతో హెలికాఫ్టర్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి” అని కాలిఫోర్నియా అటవీ, అగ్నిమాపక సంరక్షణ విభాగం ప్రతినిధి రిచర్డ్‌ కోర్డోవా తెలిపారు.

ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని రిచర్డ్‌ కోర్డోవా తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎయిర్‌ ఎమర్జెన్సీ సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని.. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్​లో ఎంత మంది ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news