ఎర్ర సముద్రంలో మరోసారి రెచ్చిపోయిన హూతీ రెబల్స్

-

ఎర్ర సముద్రంలో హూతీ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. కొన్ని నౌకా విధ్వంసక క్షిపణులు, డ్రోన్ల సాయంతో రెండు డెస్ట్రాయర్లపై దాడులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని హూతీ సంస్థ ప్రతినిధి యహ్యా సరెయ ప్రకటించారు. తమ దళాలు క్షిపణులను సమర్థవంతంగా కూల్చివేసినట్లు అమెరికా వెల్లడించింది. ఎదురు దాడి చేసి యెమెన్‌ భూ భాగంలోని మూడు క్షిపణులు, మరికొన్ని డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఎర్ర సముద్రంలో మూడు డేటాకేబుల్స్‌ తెగిపోయినట్లు టెలికం సంస్థలు, ఓ అమెరికా ప్రభుత్వాధికారి ధ్రువీకరించినట్లు వార్తలొస్తున్నాయి.

మరోవైపు సోమవారం అర్ధరాత్రి ‘ఎంఎస్‌సీ స్కై II ’ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. సాయం కోరుతూ కాల్‌ రావడంతో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా మంగళవారం తెల్లవారు జామున అక్కడకు చేరుకొంది. ఆ వాణిజ్య నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా వారిలో 13 మంది భారతీయులు ఉన్నారు. 23 మంది సిబ్బందిని భారత నౌకదళం సురక్షితంగా రక్షించింది.

Read more RELATED
Recommended to you

Latest news