రికార్డు స్థాయిలో నోబెల్ బహుమతికి నామినేషన్లు.. ట్రంప్ పేరు కూడా..

ప్రతీ ఏడాది నోబెల్ బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది. బహుమతులిచ్చే విభాగాల్లో అత్యధిక కృషి చేసి, మానవాళికి ఉపయోగకరమైన పనులు చేసే వారికి నోబెల్ బహుమతులు అందజేయబడతాయి. స్వీడన్ వేదికగా ఈ అవార్డుల ప్రధానోత్వవం ఉంటుంది. ఐతే నోబెల్ శాంతి బహుమతికి అధిక ప్రాధాన్యం ఉన్నమాట నిజం. ప్రపంచంలో శాంతి నెలకొల్పే పనులు చేసే వారికి ఈ బహుమతి దక్కుతుంది. ఈ సారి నోబెల్ శాంతి బహుమతికి ఏకంగా 329నామినేషన్లు వచ్చాయి.

శాంతి బహుమతికి ఈ రేంజిలో నామినేషన్లు రావడం ఇది మూడవసారి. ఇప్పటి వరకు అత్యధికంగా 376నామినేషన్లు 2016లో వచ్చాయి. ఈ సంవత్సరం నామినేషన్లలో ఉన్నవారిలో 234మంది వ్యక్తులు కాగా, 95సంస్థలు కూడా ఉన్నాయి. అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పేరు కూడా ఉండడం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయి, వైట్ హౌస్ ని వీడిన ట్రంప్ పేరు నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ కి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.