పాక్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఆధిక్యంలో ఇమ్రాన్‌ ఖాన్ పార్టీ!

-

పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికలు గురువారం ముగిశాయి. బాంబు పేలుళ్లు, భారీ హింస మధ్య ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపూ ప్రారంభమైంది. జాతీయ అసెంబ్లీ, నాలుగు ప్రావిన్సుల శాసనసభల కోసం జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌- ఎన్‌) పార్టీ… ఇమ్రాన్‌ఖాన్‌ సారథ్యంలో పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

చాలా స్థానాల్లో ఇమ్రాన్‌ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. వివిధ అవినీతి కేసుల్లో న్యాయస్థానాలు శిక్షలు వేయడంతో  అడియాలా జైలులో ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేయకుండా ఆయనపై పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసి,. పీటీఐ పార్టీ బ్యాట్‌ గుర్తును కూడా నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ పార్టీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగానే వివిధ గుర్తులపై పోటీ చేయగా వారు అనూహ్య విజయం సాధిస్తున్నారు. బ్యాలెట్‌ పేపర్లతో ఓటింగ్‌ ప్రక్రియ జరగడంతో శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జైలులో ఉన్న పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news