ఈరోజుల్లో ప్రాణాలకు గ్యారెంటీ లేదు. ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితి. కుటుంబానికి మీరే ఆధారం అయితే.. జరగరానిది జరిగితే.. ఇక ఆ కుటుంబం పరిస్థితి ఏంటి..? ఈ భయంతోనే చాలా మంది లైఫ్ ఇన్సురెన్స్ తీసుకుంటారు. అయితే మధుమేహం ఉన్నవాళ్ల కోసం కొన్ని స్పెషల్ ఇన్సురెన్స్ పాలసీలు ఉన్నాయి. మధుమేహం అంటే చిన్న రోగం ఏం కాదు. ఇది ముదిరితే.. వైద్య ఖర్చులు లక్షల్లో పెట్టాల్సి వస్తుంది. ఇన్సులిన్ ఇంజక్షన్స్‌లు చేయాలి. ఇలాంటి ఖర్చులంతా భరించేందుకు కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి.
వివిధ కంపెనీలు మధుమేహానికి ప్రత్యేకంగా పాలసీలు తీసుకొచ్చాయి. వైద్య ఖర్చులను అంచనా వేసి పాలసీహోల్డర్స్ ఈ హెల్త్ ప్లాన్స్ తీసుకోవచ్చు.
మధుమేహంతో బాధపడుతున్న అడల్ట్స్ సంఖ్యలో ఇండియా రెండో స్థానంలో ఉంది. చైనా మొదట నిలిచింది. తాజా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) రిపోర్ట్ ప్రకారం.. 2030 నాటికి భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 9.2 కోట్లకు మించి ఉంటుందని అంచనా.
మధుమేహం సమస్యకు సాధారణ చికిత్స కూడా రోగులకు ఆర్థిక భారమే. ఉదాహరణకు టైప్ 1 మధుమేహం ఉన్న వ్యక్తులు ఎటువంటి సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల కోసం నెలకు దాదాపు రూ.5,000 నుంచి రూ.15,000 వరకు ఖర్చు చేస్తారు. ఇటువంటి ఖర్చులను భరించడం మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చాలా కష్టం. మధుమేహ బాధితులకు మందులు, ఆసుపత్రిలో చేరే ఖర్చులు పెరుగుతున్నందున, బాధితులకు ఈ వ్యాధిని కవర్ చేసే బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. భారతదేశంలోని జనలర్ ఇన్సూరెన్స్ పాలసీలు మధుమేహం సంబంధిత సమస్యలను కవర్ చేస్తాయి. అయితే ఇందుకు 2-4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) ఖర్చులను ఇలాంటి పాలసీలు కవర్ చేయకపోవచ్చు.
డయాబెటిక్ స్పెసిఫిక్ ప్లాన్స్
కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు డయాబెటిక్ స్పెసిఫిక్ ప్లాన్స్ తీసుకొచ్చాయి. అంటే కేవలం ఈ వ్యాధిని కవర్ చేసే పాలసీలు ఇవి. ఈ ప్లాన్‌లు ఖరీదైనవి అయినప్పటికీ, తక్కువ వెయిటింగ్ పీరియడ్, డిజీస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తాయట. అందుకే వీటికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ ప్లాన్‌లు మధుమేహం-రిలేటెడ్ సమస్యలకు వన్ డే కవరేజ్, ప్రత్యేక హెల్త్ కోచెస్ గైడెన్స్, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వెల్నెస్ బెనిఫిట్స్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్దిష్ట ఆరోగ్య ప్రమాణాలను పాటించే పాలసీదారులకు ప్రీమియం రెన్యూవల్స్‌పై డిస్కౌంట్లు కూడా అందిస్తాయి.
డయాబెటిక్- స్పెసిఫిక్ ప్లాన్స్‌లో రకాలు
మధుమేహ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఆప్షన్లు పరిశీలిస్తున్నప్పుడు, ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ కేర్ ఫండ్ ప్రయోజనాలను వేయాలి. అదనపు వైద్య ఖర్చులను కవర్ చేయడానికి హెల్త్ కేర్ ఫండ్ ఉపయోగపడుతుంది. కానీ ఆస్పత్రిలో చేరిన సందర్భంలో అది సరిపోకపోవచ్చు.
ఉదాహరణకు 6% వడ్డీతో హెల్త్‌కేర్ ఫండ్‌లో సంవత్సరానికి నెలకు రూ.20,000 పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపు రూ.2.5 లక్షల ఆదాయం వస్తుంది. మరోవైపు ఇన్సూరెన్స్ పాలసీ కోసం రూ.20,000 యాన్యువల్ ప్రీమియం రూ.10 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది.
ఇది మరింత కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ అందిస్తుంది.
తేలికపాటి నుంచి మితమైన మధుమేహ వ్యాధిగ్రస్తులు (hb1Ac లెవల్ 7-8% కంటే తక్కువ) రెగ్యులర్ కాంప్రహెన్సివ్ పాలసీ పొందవచ్చు. వెయిటింగ్ పీరియడ్‌ని తగ్గించడానికి అదనంగా 15-20% ప్రీమియం చెల్లించడాన్ని పరిశీలించవచ్చు. మధుమేహం తీవ్రమైతే, డయాబెటిక్-స్పెసిఫిక్ ప్లాన్స్‌కి మారే అవకాశం ఉంది.
మితం నుంచి తీవ్రమైన మధుమేహం ఉన్న వ్యక్తులకు (hb1Ac లెవల్స్ 8-10% మధ్య ), డయాబెటిక్-స్పెసిఫిక్ ప్లాన్స్ మరింత అనుకూలంగా ఉంటాయి. ఈ ప్లాన్‌లకు లేటెస్ట్ హెల్త్ రిపోర్టులు సబ్మిట్ చేయాల్సి రావచ్చు. అధిక ప్రీమియం ఉంటుంది.