డెమొక్రాటిక్ నామినీ జో బిడెన్ తో బుధవారం జరిగిన మొదటి అధ్యక్ష చర్చలో అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్యను ఖచ్చితంగా వెల్లడించని దేశాలలో భారత్ కూడా ఉందని వ్యాఖ్యానించారు. మహమ్మారిని నియంత్రించడంలో యునైటెడ్ స్టేట్స్ పనితీరును సమర్థిస్తూ ట్రంప్ భారత్ పై విమర్శలు చేసారు.
భారతదేశం, చైనా మరియు రష్యా కరోనా వైరస్ కారణంగా మరణాలపై ఖచ్చిత లెక్కలను బయటపెట్టలేదు అని ఆయన ఆరోపించారు. అమెరికాలో ఏడు మిలియన్లకు పైగా కేసులు, 200,000 మందికి పైగా మరణాలు ఉన్నాయని బిడెన్ హైలైట్ చేసినప్పుడు, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసారు. “మీరు సంఖ్యల గురించి మాట్లాడేటప్పుడు, చైనాలో ఎంత మంది మరణించారో మీకు తెలియదు. రష్యాలో లేదా భారతదేశంలో మరణాలు మీకు తెలియదని అన్నారు.