మాజీ డిప్యూటీ సీఎం. ఎడ్యుకేషన్ మినిస్టర్ కడియం శ్రీహరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపడబోతున్నారా? అంటే ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారం చూస్తే నిజమే అనిపిస్తోంది. త్వరలో జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో కడియం శ్రీహరిని అధికార పార్టీ నిలబెడుతున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఎలాంటి పదవి లేక కడియం సైలెంట్‌గా వుంటున్నారు. ఆయనని పట్టభద్రుల సభకు పంపాలని తెరాస అధినాయకత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.
ఇటీవలే తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ మాజీ మంత్రి కడియంని తన ఆఫీస్‌కి పిలిచారని, వరంగల్, నల్లగొండ, ఖమ్యం నియోజక జిల్లాలతో కూడిన గ్యాడ్యుయేట్ల నియోజక వర్గం నుండి ఎమ్మెల్సీగా బరిలోకి దిగాలని ఆయనని కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో కడియం శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సమయంలో పలు కీలక పదవుల్లో కొనసాగిన ఆయన తెరాసలో మాత్రం గత కొంత కాలంగా సైలెంట్‌గా వుంటున్నారు. గత రెండేళ్లుగా తెరాసకు దూరంగా వుంటున్నారు. దీంతో రంంలోకి దిగిన కేటీఆర్ ఆ దూరాన్ని తగ్గించే పనిలో పడ్డారట.
గతంలో వరంగల్ నుంచి ఎంపీగా ఎన్నికైన శ్రీహరి ఆ తరువాత డిప్యూటీ సీఎంగా కూడా దవిని చేపట్టారు. కానీ ఆయనకు తెరాస 2018 ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్‌ని కేటాయించకుండా షాకిచ్చింది. తన కుమార్తె కు టిక్కెట్ కోసం ప్రయత్నించినా అధిష్టానం కడియంని పట్టించుకోలేదు. దాంతో తెరాస కార్యకక్రమాలకు కడియం దూరంగా వుంటూ వస్తున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తెకు టిక్కెట్ ఇస్తేనే తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కడియం కండీషన్ పెట్టారట. ఆ డిమాండ్‌కు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.