భారత్‌లో అతి ముఖ్యమైన, హిందూవులకు చాలా పెద్ద పండుగ దీపావళికి కేవలం ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, చైనా మరియు భారతదేశం మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల మధ్య చైనా దీపాలు మరియు అలంకరణ వస్తువులకు భారీగా డిమాండ్ పడిపోయిందని స్పష్టంగా భారత మార్కెట్లో కనిపిస్తుంది.. లడ్డాఖ్ వివాదంతో మరింత ముదరటంతో చైనా వస్తువులపై భారత్ నిషేధం విధించింది.. అనేక టెక్ సంస్థలను బ్యాన్ చేసింది.. దాదాపుగా 150పైగా చైనా యాప్‌లను బహిష్కరించింది..చైనా సంస్థలు ఇండియన్ ప్రైవేట్ డాటాను తస్కరిస్తుంది భారత్ ఆరోపించింది.
ఇండో చైనా చర్చలు ఇప్పటి వరకూ దాదాపుగా 8 పైగానే జరిగాయి.. అయినా డ్రాగన్ తీరు మారడంతో భారత్ మరింత దూకూడుగా వ్యవహరిస్తుంది.. చిన్న వస్తువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన చైనాపై మరిన్ని ఆంక్షలు విధించాలని ఇండియాలో చాలా రాష్ట్రాలు చైనా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులును ముఖ్యంగా క్రాకర్, దీపాల ప్రతిమలపై బ్యాన్ విధించాయి.. చైనా ఉత్పత్తులను బహిష్కరించడం వల్ల ఈ దీపావళి సీజన్లో చైనా ఎగుమతిదారులపై 400 బిలియన్ రూపాయలు (5.38 బిలియన్ డాలర్లు) చేరుకోగల భారీ వ్యాపార నష్టాలను కలిగిస్తుందని కొన్ని భారతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి..
అంతేకాకుండా, కరోనా వ్యాప్తి.. చైనా మరియు భారతదేశం మధ్య సరిహద్దు ఘర్షణ వల్ల భారతదేశానికి చిన్న వస్తువులను విక్రయించే కొన్ని సంస్థలు..దేశీయ మార్కెట్‌పై..ఇతర పొరుగు దేశాల వైపుకు మార్చుకునట్లు తెలుస్తుంది.. తద్వారా భారతదేశం వల్ల కలిగే వ్యాపార నష్టాలను నివారించుకునేందకు డ్రాగన్ కంట్రీ ప్లాన్ చేస్తుంది..కొందరు మన దేశ ఉత్పాదక రంగానికి తమ మద్దతును ఇస్తూ..భారతీయ ఉత్పత్తులను చాలా ఎక్కువ ధరకు విక్రయించేందుకు ముందుకు రావడానిక సిద్దంగా ఉండాలి..చైనా దీపాలను ఎదుర్కోవటానికి దీపావళి పండుగ కోసం ఆవు పేడ నుండి తయారైన 330 మిలియన్ మట్టి దీపాలను ఉత్పత్తి చేస్తామని ఒక సంస్థ ప్రకటించింది..