ఏపీని టూరిజం హబ్‌గా తీర్దిదిద్దుతాం : పవన్ కళ్యాణ్

-

ఆంధ్రప్రదేశ్‌ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో పలు కీలక పర్యాటక ప్రాజెక్టులను అమలు చేయబోతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి సహాయ సహకారాల కోసం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మంగళవారం భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏపీకి 975 కి.మీ సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో పర్యాటక రంగాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు.గండికోట లాంటి వారసత్వ ప్రాంతాల అభివృద్ధితో పాటు రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ వివరించారు.రాబోయే రోజుల్లో ఏపీకి పర్యాటక పరంగా అనేక పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version