పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దు..ప్రభుత్వాన్ని ఇక మేము చీల్చిచెండాడుతాం : కేటీఆర్

-

రాష్ట్రంలో గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ సర్కారు స్పందించిన తీరుపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. ఫుడ్ పాయిజన్‌తో మృతి చెందిన గురుకుల విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లితే బారికేడ్లు పెట్టి అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. గురుకుల విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలు, గురుకులాల పరిస్థితిపై కనీసం సీఎం రేవంత్ సమీక్ష చేయట్లేదని విమర్శించారు.

‘ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయం.. ఆ కుటుంబాల తరపున శాసన సభలో కూడా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని ప్రకటించారు. కష్టాలు వచ్చాయని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ధైర్యంగా ఉండండి అని కోరారు. ఆరోగ్యం బాలేకపోతే తాము ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పిస్తాం.బీఆర్ఎస్‌ను సంప్రదించండి’ అని సూచించారు. సీఎం రేవంత్ నిన్నటి ప్రెస్‌మీట్‌లో ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించిందన్నారు. రాహుల్‌తో తిట్లు పడ్డాక ఎక్కడేం చేయలేక..తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version